ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడిపోవడం (డిఫీట్), కేసీఆర్ తిరిగి గెలవడం (రిపీట్) ఖాయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ సర్వేతోనే ఈ విషయం తేటతెల్లమైందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పోల్ సర్వేలో తెలంగాణ జనం సీఎం రేవంత్‌రెడ్డి సంక్షోభపాలనపై రాళ్ల వర్షం, పదేండ్ల కేసీఆర్ సంక్షేమపాలనపై పూలవర్షం కురిపించారని తెలిపారు.
కాంగ్రెస్ దగా కోరు పాలన మాకొద్దు.. కేసీఆర్ పాలన ముద్దు అని కుండబద్దలు కొట్టడం ఏడాదికే కాంగ్రెస్ దుష్ట పాలనపై తెలంగాణ ప్రజల విముఖతకు నిలువెత్తు నిదర్శనమని స్పష్టంచేశారు. ఇకనైనా హామీలను అమలు చేయాలని సూచించారు. లేకపోతే రేవంత్ సర్కార్‌కు శంకరగిరి మాన్యాలే గతి అని హెచ్చరించారు.