రేవంత్ తీరుతో ఘోషిస్తున్న జైపాల్‌రెడ్డి ఆత్మ
కల్వకుర్తి సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, రెండున్నరేండ్లు దాటినా ఎందుకు పూర్తిచేయడంలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ధ్వజమెత్తారు.
- సీఎం పాలమూరు బిడ్డ అని చెప్పుకొనేందుకు సిగ్గనిపిస్తుంది
- కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, రెండున్నరేండ్లు దాటినా ఎందుకు పూర్తిచేయడంలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలను తప్పుదోవపట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డితో చర్యలతో జైపాల్‌రెడ్డి ఆత్మ ఘోషిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆయన పేరు, ప్రతిష్టలను వాడుకొని వదిలేశారని దుయ్యబట్టారు. బుధవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకొనేందుకు సిగ్గేస్తున్నదని దెప్పిపొడిచారు. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. అహంకారంతో మాట్లాడటం తప్ప రేవంత్ సాధించిందేమీలేదని విమర్శించారు.
యథేచ్ఛగా ఇసుక దోపిడీ: బీరం హర్షవర్ధన్‌రెడ్డి
పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మండలం పెంట్లవెళ్లి మండలంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నదని స్పష్టంచేశారు. అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మంత్రి జూపల్లి నీతులు చెబుతూ చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
తిట్లతోనే రెండున్నరేండ్లు: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల
కాంగ్రెస్ గద్దెనెక్కి తిట్లతోనే రెండున్నరేండ్లు దాటిందని, అయినా ఉద్ధరించిందేమీలేదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొడ్డిదారిలో గెలిచిన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని మరచిపోయారని ఎద్దేవాచేశారు. కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. కేసులు పెట్టడంలో ఆయనకు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని చురకలంటించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చి తన సొంతగ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పక్కనపెడుతున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

