హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తమిళనాడుకు చెందిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే సీహెచ్ శేఖర్, ఆయన సతీమణి మయూరి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బుధవారం వీరిని కేటీఆర్‌కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరిచయం చేశారు.
ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. త్వరలోనే తాను బీఆర్ఎస్లో చేరనున్నట్టు మయూరి చెప్పారు. తన అమ్మమ్మ ఊరు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్, నాయనమ్మ ఊరు నిర్మల్ జిల్లా అని ఆమె తెలిపారు.