అమరచింత, జూలై 29 : సాగునీటిపై పాలకులకు అవగాహన లేదని, రైతులంటే అసలు పట్టింపే లేదని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా అమరచింత సమీపంలోని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువను బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో క లిసి పరిశీలించారు. సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ వానకాలం ప్రారంభమై రెండు నెలలు దాటినా సాగు పనులు చేపట్టక ఆందోళన చెందుతున్న రైతులకు వెంట నే నీటిని అందించాలని, లేకుంటే జూరాల ప్రాజెక్టుపై ధర్నా చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు. బుధవారం 11 గంటల ప్రాంతంలో లష్కర్లతో మోటర్లను ఆన్ చే యించి ఎడమ కాలువకు సాగునీటిని విడు దల చేయించినట్టు చెప్పారు. చిన్న కార్యక్రమాలకే హడావుడి చేస్తున్న పాలకులు రై తులు నీరు విడుదల చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నదని నిలదీశారు