దళితబంధుతో ఆర్థిక ప్రగతి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసి న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. లబ్ధిదారుల కుటుంబాలు వెలుగులు నింపాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం.
- సంగారెడ్డి జిల్లా బుడ్డాయిపల్లిలో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు
- కేసీఆర్ పెట్టిన పథకంతో నిలదొక్కుకున్న లబ్ధిదారులు
- దళితబంధు పథక వాహనాలతో గ్రామంలో లబ్ధిదారుల భారీ ర్యాలీ
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
వట్పల్లి, ఏప్రిల్ 14 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసి న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. లబ్ధిదారుల కుటుంబాలు వెలుగులు నింపాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం. ఈ గ్రామానికి చెందిన దళితులు దళితబంధు పథకం ద్వారా వ్యాపారంతోపాటు, రవాణా రంగంలో రాణిస్తున్నారు. వాటి ఫలాలు ఇప్పుడిప్పుడే కన్పిస్తున్నాయి. లబ్ధిదారులు సొంత నిధులతో గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం వారి ఆర్థిక ప్రగతికి అద్దం పడుతున్నది. ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా తీసుకున్న వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ద్వారా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడా రు. అనంతరం మాజీ ఎమ్మెల్యే క్రాంతి మా ట్లాడుతూ.. అంబేద్కర్ కలలుగన్న ఆర్థిక స మానత్వ సాధనలో దళితబంధు పథకం విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. గ్రామ దళితులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం వినియోగిచండం అభినందనీయమని కొనియాడారు. అంబేద్కర్ ఆర్థిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ.. దళితబంధు పథకం ద్వారా లభ్ధిదారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం వల్ల దళితులు వ్యాపారవేత్తలుగా మారి, రవాణా రంగంలో స్థిరపడి గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని చంటి క్రాంతి కిరణ్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

