సీసీసీ నస్పూర్, అక్టోబర్ 8: కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ న్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గ కార్యకర్తలకు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు కాంగ్రెస్ బాకీ కార్డు లు పంపిణీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ సర్కార్ రూ.3.5 లక్షల కోట్లు అప్పు చేసి.. సంపద సృష్టిస్తే, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికల్లో ఈ సారి డబ్బులు ఉన్నవారికే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలనే నిర్ణయించడాన్ని తప్పుబట్టారు.