వికారాబాద్, నవంబర్ 11 : సీఎం సొంత నియోజకవర్గంలోనే అధికారులు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొన్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రకటనలో పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి జరగటం దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ట్టు తెలిపారు.
దుద్యాలలో 1,350 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఫార్మా కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించిందని, ఇక్కడి రైతుల నుంచి పట్టాభూములు సేకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. రైతులు తమ ప్రాణం లాంటి భూములను ఔషధ కంపెనీకి ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నా పట్టింపులేని కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తూ వారి ని తీవ్ర మనోవేదనకు గురించేసిందని, అందులకే వారు తిరగబడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు.