నల్లగొండ : బీఆర్ఎస్ సీనియర్ నేత సయ్యద్ సబిహుద్దీన్ ఫరీద్ (Fariduddin) హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు మహమూద్ అలీ(Mahamood ali), జగదీష్ రెడ్డి(Jagadishreddy) నల్లగొండ జిల్లా మునుగోడు రోడ్ ఖబరస్థాన్లో జరిగిన అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు(Tribute) అర్పిం చారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫరీదుద్దీన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకైనా పాత్ర పోషించారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసిన నాయకుడని ప్రశంసించారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేశారన్నారు. ఆయన మరణం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. వారి వెంట జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
IAS Officers | స్టే ఇస్తూ పోతే.. ఎన్నటికీ తేలదు.. ఐఏఎస్ల పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్యలు
TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం