జగిత్యాల, జూలై 10 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శాపంలా మారాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్‌పై ఉన్న ద్వేషంతో ప్రజలకు అ న్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు పాటిజివ్ దృక్పథం తో ఉండాలని, రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధమైన భావజాలంతో ఉన్నారని ధ్వజమెత్తా రు. ఆయనకు కలలో కూడా కేసీఆరే కన్పిస్తున్నారని, అందుకే బిత్తరపోతున్నాడని ఎద్దే వా చేశారు. శుక్రవారం జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జీవన్‌రెడ్డి మీడియా తో మాట్లాడారు.
రాష్ట్రంలో పరిస్థితులు మరో నెల రోజులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు, తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొంత స్వతంత్రంగా వ్యవహరించాలని, పరిస్థితి చేయిదాటిపోకముందే సాగునీటిని ఎత్తిపోయాలని సూచించారు. దెబ్బతిన్న పిల్లర్లు మరమ్మతులు చేపట్టి, మేడిగడ్డ బరాజ్‌ను ఉపయోగించుకోవాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి, ఏడాది గడిచినా మరమ్మతులు చేయడం లేదని మండిపడ్డా రు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసుకునేందుకు ఉన్న అవకాశాలను కేటీఆర్, హరీశ్‌రా వు నివేదించినా ప్రభుత్వంలో ఎలాంటి చల నం లేదని విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి 9 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉన్నదని సూచించా రు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.