మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 4 : మహబూబ్‌నగర్ ఐటీ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులను మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. బుధవారం ఆమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో సుమారు 450 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్, మల్టీపర్పస్ ఐటీ కారిడార్ ఉన్నదని తెలిపారు.
మొదటి దఫాగా కొన్ని ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 850 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 80 కిలోమీటర్లు దూరంలో ఐటీ కారిడార్ ఉన్నదని, అన్ని రకాల సదుపాయాలతో ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో పాలమూరు ఐటీ కారిడార్ వరకు మెట్రో వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని వారికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.