హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇ చ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మా జీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాం డ్ చేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఆ యన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాంధీ దవాఖాన వద్ద ఈ హామీ ఇచ్చారని, ఏడాది పాలన పూర్తయి నా ఎందుకు హోంగార్డులను పర్మినెంట్ చే యడం లేదని నిలదీశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, పోలీసులకు ఉన్న అన్ని సదుపాయాలను హోంగార్డులకూ కల్పించాలని డిమాండ్‌చేశారు.
హోంగార్డుల దినోత్స వం సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.921కి కేవలం రూ.79 అదనంగా ఇచ్చి 1,000 పెంచినట్టు ప్రభుత్వం బిల్డప్ ఇస్తున్నదని విమర్శించారు. తాము అధికారంలో ఉ న్నప్పుడే హోంగార్డులకు ప్రభుత్వ బీమా సౌ కర్యం కల్పించామని గుర్తుచేశారు. నాడు రూ.9 వేల వేతనం ఉండగా, దానిని రూ.20 వేలకు పెంచామని, వారికి 30 శాతం పీఆర్సీ పెంచామని తెలిపారుఉ. హోంగార్డుల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ట్రాఫిక్ పొలీస్స్టేషన్లలో పనిచేసే వారికి 30 శాతం రిస్ అలవెన్స్, పోలీసులతో సమానంగా డ్రెస్ అలవెన్స్, ప్రత్యేక లీవ్‌లు ఇచ్చామని గుర్తుచేశారు.
హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని రాజీవ్ త్రివేది నేతృత్వంలో తమ ప్రభుత్వ హయాంలో కమిటీ వేశామని, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా నియామక ప్రక్రియ చేయాలనుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైరైన వారికి కూడా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హోంగార్డుల నియామకాలు వెంటనే చేపట్టాలని సూచించారు. హోంగార్డులకు అసోసియేషన్ ఉండాలని డీజీపీ కార్యాలయంలోనే ఓ గదిని కేటాయించామని, ఇప్పుడు వారికి ఆ గది తాళలు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురిచేసి, సస్పెండ్ చేసిన స్పెషల్ పోలీసులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోం గార్డులను వేధిస్తే ఊరుకోబోమని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.