హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆందోళన చేపట్టిన నిరుద్యోగులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, వారిని బేషరతుగా విడుదల చేసి, క్షమాప ణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నాడు ఓట్ల కోసం అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగులను రెచ్చగొట్టారని, నేడు హామీలు అమలు చేయాలని అడిగితే అణగదొకుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీకి నేడు నిరుద్యోగుల వద్ద కు వెళ్లేందుకు మొహం చెల్లడం లేదా? అని ప్రశ్ని ంచారు. యూత్ డిక్లరేషన్ ఏమైంది? అని నిలదీశారు. సచివాలయం ముట్టడికి వెళ్లిన నిరుద్యోగులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని ప్రశ్నించారు.