హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డి అభివన గోబెల్స్.. గతంలో రేవంత్ మాట్లాడినట్టుగా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయనేది ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంతనిజమో.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కూడా అంతేనిజం.. అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే అది రేవంత్ సరారుకే దకుతుంది’ అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి, 17 వేల కోట్లతోనే రుణ మాఫీ అయినట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పి మాటతప్పారని, ఆరు గ్యారెంటీలను గడువులోగా అమలుచేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు చెప్పారని, ఆ విషయాన్ని రుణమాఫీ చుట్టూ తిప్పి అరకొరగా అమలుచేసి రుణమాఫీ అయిపోయిందని దబాయిస్తూ రాజీనామా చేయాలని దుర్భాషలాడడం సరికాదని హితవుపలికారు. రుణమాఫీ పూర్తయితే రాష్ట్రంలో రైతులు ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు. 70 లక్షల మంది రైతుల్లో 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారని, ప్రభుత్వం మాత్రం 44 లక్షల మంది అని లెకలు చెబుతున్నదని అసలుకంటే కొసరెక్కువ అన్నట్టు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.300 కోట్ల దాకా ఖర్చు చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా ఒక్క విడతకు రూ.15 వేల కోట్లు కావాలని, అది ఎగ్గొట్టి రూ.17వేల కోట్లతో రుణమాఫీ చేసి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ, చర్చలు, శాసనసభలో చర్చలన్నీ పకకు పోయాయని, జూలై 15కు నివేదిక అన్నారని, ఆగస్ట్ 15 దాటినా గతి లేదని, కనీసం కృష్ణానదిలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు జిల్లాలో కుంటలు, చెరువులు వెలవెలబోతున్నాయని, కట్టిన రిజర్వాయర్లను నింపుకొనే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఇప్పటి వరకు 1,11,027 వాట్సాప్ ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సీఎంకు పంపిస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ పాల్గొన్నారు.