కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 6 : ఓ వైపు పంట లు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఐపీఎల్ టోర్నీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతు సమస్యలను పట్టించుకోకుండా క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ఆరోపించడం దురదృష్టకరమని, బీఆర్ఎస్ హయాంలో జూపల్లి మం త్రిగా ఉన్నప్పుడే పీఆర్ఎల్ఐ, మిషన్ భగీరథ పను లు ప్రారంభమయ్యాయని, పీఆర్ఎల్ఐ పనులు 20 శాతం పూర్తయితే.. 90 శాతం నిధులు డ్రా చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు మంత్రి వర్గంలోనే ఉన్నాడు కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.