హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహిళలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీని ఇచ్చి మరోసారి మహిళలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మం డిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆమె మీడియాతో.. మహిళలకు ప్రకటించిన 2,500 పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చే స్తారో, ఎంతమందికి ఇస్తారో చెప్పాలని సవా ల్ చేశారు. పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళా సదస్సు ప్రభుత్వ కార్యక్రమమా లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా అని నిలదిశారు. చేతి గుర్తు ఉన్న బ్యాడ్జీలను మహిళలకు అం దించారని చెప్పారు. సీఎంకి కేసీఆర్‌ను దూషించడం తప్ప మరో పనిలేదని మండిపడ్డా రు. ఓడిపోయినా సిగ్గు రాలేదని రేవంత్‌రెడ్డి అంటున్నారని, గత పదేండ్లు కాంగ్రెస్ ఓడిందని, ఇప్పటికీ కేంద్రం లో, అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో లేదని, మరి ఆ పార్టీ నేతలకు కూడా సిగ్గురాలేదా అని తాము అనగలమని చెప్పారు. రేవంత్‌రెడ్డి భాషను ప్రజలందరు గమనిస్తున్నారని, కోటి కోట్లు ఎక్కడివని ఆమె నిలదీశారు. అసరా పింఛనును ఇంతవరకు 4 వేలకు పెంచలేదని, డబ్బు ఇచ్చే పథకాలను అమలు చేయడం లేదని, ఉద్దెర బేరం పథకాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. మహిళలు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రహించాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.