హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/ఆర్కేపురం : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనసభలో ఇటీవలి పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు. అసెంబ్లీ బయట, లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఎండగట్టిన తీరును ఆయన ప్రశంసించారని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కేసీఆర్ సూచించినట్టు సబిత తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పట్లోల్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, గొడుగు శ్రీనివాస్, సాజీద్, జగన్మోహన్రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, పెంబర్తి శ్రీనివాస్, మురళీధర్‌రెడ్డి, నవీన్ తదితరులున్నారు.
కేసీఆర్‌కు సంక్షేమ చిత్రపటం అందజేత
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన వివిధ సంక్షేమ పథకాల సమాహార భారీ పెయింటింగ్‌ను కేసీఆర్‌కు ఇంటీరియర్ డిజైనర్ సౌమ్యారెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సౌమ్యారెడ్డిని అభినందించారు. సౌమ్యారెడ్డి అమెరికాలో ఇంటీరియర్ డిజైనర్‌గా గుర్తింపుపొందారు.