కందుకూరు, నవంబర్ 25 : ఫోర్త్‌సిటీ పేరుతో రైతులను బెదిరించి భూములు లాక్కోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులను మోహరించి భూములను సర్వే చేయడంపై ఆమె మండిపడ్డారు. ఫోర్త్‌సిటీ ఏర్పాటుచేస్తున్నారా? లేక ఫార్మాసిటీని కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోర్త్సిటీకి ప్రత్యేకంగా 330 ఫీట్ల రోడ్డు అమసరం లేదని, ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డికి లెటర్ రాస్తానని తెలిపారు. ఫార్మాసిటీ కోసం మాజీ సీఎం కేసీఆర్ రైతులను ఒప్పించి 14వేల ఎకరాల భూముల సేకరించినట్టు గుర్తుచేశారు. ఫోర్ట్సిటీ ఏరియాలో రియల్ వ్యాపారం కోసమే రోడ్డు అమసరమని, అందుకోసమే ప్రభుత్వం చాలెంజ్‌గా భూములు తీసుకుంటుందని ఆరోపించారు. పేద రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి రైతుల భూములను లాక్కోవద్దని సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మన్నె జయేందర్‌ముదిరాజ్, సీనియర్ నాయకులు కాకి దశరథముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మాదేవేందర్, మాజీ సర్పంచ్ కాసుల రామక్రిష్ణారెడ్డి, డైరెక్టర్ పొట్టి ఆనంద్, మాజీ డైరెక్టరు సామ ప్రకాశ్‌రెడ్డి, గయ్యని సామయ్య, శ్రీధర్, పర్వతాలుయాదవ్, సలావుద్దీన్, రాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.