హైదరాబాద్ : మాజీ మంత్రి, తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ( Rajesham Goud ) బీఆర్ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ను శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లోని నివాసంలో లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వికాస్, ఎన్ఆర్ఐ విష్ణు ప్రకాష్‌తో కలిసి పలు అంశాలపై చర్చించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాల బలోపేతం, వివిధ సామాజిక వర్గాల అవసరాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలు, భవిష్యత్ కార్యాచరణపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడేలా రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి ముందడుగు వేయాలని నాయకులు తెలిపారు. పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని సమక్షంలో ఉన్న నాయకులు పేర్కొన్నారు.