ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 11 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వనపర్తి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఖిల్లాఘణపురంలో రజతోత్సవ సభకు సంబంధించి ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మా ట్లాడుతూ.. ప్రతి గ్రామం లో సమావేశాలు ఏర్పా టు చేసుకొని కార్యకర్తలను తరలించేవిధంగా నాయకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, విజయ్‌కుమార్, నందిమల్ల అశోక్ పాల్గొన్నారు.