హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగా ణ): రైతు భరోసాకు కిసాన్ సమ్మాన్ నిధి డాటాను ప్రాతిపదికగా వినియోగిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. సర్కారు నిర్ణయం దుర్మార్గమైనదని ధ్వజమెత్తారు.
రైతు భరోసాపై 7 నెలలు దాటినా కటాఫ్ తేదీ నిర్ణయించకపోవటం ప్రభు త్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశం లో రైతుబంధు పథకాన్ని తొలిసారి కేసీఆర్ ప్రభుత్వం అమ లు చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ప్రధానమం త్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ఆ పథకంలోనూ సవాలక్ష కారణాలు చెప్పి ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో 70 లక్షల మందికి పైగా రైతులు ఉంటే, కిసాన్ సమ్మాన్ నిధి అందేది 36.1 లక్షల మందికేనని తెలిపారు. ప్రస్తు తం రాష్ట్రంలో కిసాన్ సమ్మాన్ నిధి రైతుల సంఖ్య 29,78,394 మంది మాత్రమేనని వెల్లడించారు.