వనపర్తి టౌన్, డిసెంబర్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోవాలాల బతుకులను బజారుకీడ్చిందని బీఆర్ఎస్ అనుబంధ ఆటో యూనియన్ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటో బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చా రు. రేవంత్ సర్కారు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందని ధ్వజమెత్తారు.