పెబ్బేరు, ఫిబ్రవరి 3 : బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల(,Municipal elections) సందర్భంగా బీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు ఆయన మంగళవారం పెబ్బేరులో బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల వ్యయంతో పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ అండగా ఉందని చెప్పేందుకు 4వ వార్డు నుంచి ఎంబీబీఎస్ విద్యార్థిని పవిత్రను నిలబెట్టినట్లు ఆయన వెల్లడించారు. పెబ్బేరు మున్సిపాలిటీ గతం నుంచి బీఆర్ఎస్ను ఆదరించిందని, ఈ పర్యాయం కూడా ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రజలు తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని నిరంజన్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎన్నికల సమన్వయకర్త మేకల కర్రెస్వామి, ఇన్చార్జి లక్ష్మారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాములు, నాయకులు రాజశేఖర్, వెంకటేశ్, విశ్వరూపం పాల్గొన్నారు.