హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నల్గొండ రైతు మహాధర్నా అద్భుత విజయం సాధించడంతో, అందులో భాగస్వామ్యమైన గులాబీ సైనికులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. రైతాంగానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేందుకు నల్గొండలో మంగళవారం చేపట్టిన రైతు ధర్నా నిదర్శనమని తెలిపారు. ధర్నాను విజయవంతం చేసిన రైతాంగానికి, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.