బీఆర్ఎస్ నాయకుల గురుకుల బాట కొనసాగుతున్నది. దీంతో తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడుతాయోనని ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. గురుకులాలను సందర్శించకుండా గేట్లకు తాళాలు వేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. పలుచోట్ల బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయిస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు గురుకులాల్లో ఉన్న అధ్వాన పరిస్థితిని ఎత్తిచూపుతున్నారు. గేట్లకు తాళాలు వేసినా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు.
Koppula Eshwar | గొల్లపల్లి, డిసెంబర్ 5 : రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో సమస్యలు తెలుసుకోవడానికి వస్తే తమను అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి బీసీ గురుకుల బాలికల పాఠశాలను జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంతతో కలిసి కొప్పుల సందర్శించేందుకు రాగా, లోపలికి వెళ్లకుండా అడ్డుకొని గేట్‌కు తాళం వేశారు. ఈ విషయం తెలుసుకొని వి ద్యార్థినులు గేట్ వద్దకు రాగా, కొప్పుల వారి తో ముచ్చటించారు. 1100 గురుకులాలు స్థాపించి అన్ని వర్గాల పిల్లలకు మెరుగైన విద్య అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే గురుకుల వసతి గృహాల్లో 50 మంది విద్యార్థులు మరణించడం బాధాకరమని అన్నారు.
పురుగుల అన్నం పెడుతున్నరు మేడం..
ఇనుగుర్తి, డిసెంబర్ 5 : ‘పురుగుల అన్నం పెడుతున్నరు.. నీళ్ల కూరలు వడ్డిస్తున్నరు’ అంటూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు వాపోయారు. గురుకుల పాఠశాలలో నాణ్యతలేని భోజనంపై ‘ముద్ద అన్నం.. నీళ్ల కూరలు’ అనే శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ స్పందించారు. సదరు గురుకుల పాఠశాలను తనిఖీ చేయాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు సివిల్ సప్లయీస్ మేనేజర్ కృష్ణవేణి, జిల్లా క్వాలిటీ కంట్రోలర్ (క్యూసీ) శంకరయ్య, సాంఘిక సంక్షేమ గురుకులం భద్రాద్రి జోన్ ఆఫీసర్ స్వరూప పాఠశాలలోని వంటశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. తమ కు పురుగుల అన్నం, నీళ్ల కూరలు పెడుతున్నారని, అన్నం ముద్దలు ముద్దలుగా ఉం టుందని తెలిపారు. మినరల్ వాటర్ రావ డం లేదని, బోరు వాటర్‌తో సమస్యలు వ స్తున్నాయని వాపోయారు. అనంతరం క్యా టరింగ్ కాంట్రాక్టర్ మురళికి జోన్ ఆఫీసర్ స్వరూప మెమో జారీ చేశారు. రుచికరంగా వంటలు చేయాలని, లేకపోతే చర్య లు తప్పవని క్యాటరింగ్ సిబ్బంది హెచ్చరించారు.
ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన
ఎర్రుపాలెం, డిసెంబర్ 5 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నది ప్రజా పాలన కాదని.. రాక్షస పాలన అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను గురువారం సందర్శించేందుకు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. కమల్రాజుతోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటరు
తాండూర్, డిసెంబర్ 5 : ప్రభుత్వం ఇం కెంత మంది గురుకుల విద్యార్థులను పొట్టనబెట్టుకుంటుందని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ప్రశ్నించా రు. గురుకుల బాటలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల సందర్శనకు నాయకులతో కలిసి వెళ్లగా యాజమాన్యం, పోలీసు లు అడ్డుకొన్నారు. దీంతో బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.
అరెస్టుల పర్వం
హనుమకొండ జిల్లాలో గురుకులాల సందర్శనకు గురువారం వెళ్లిన బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశా రు. హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో ని ఎంజేపీ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకొ ని అరెస్ట్ చేశారు. ఐనవోలు మండలంలోని కేజీబీవీ సందర్శనకు బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అరూరి రంజిత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు వెళ్ల గా ఎస్సై పస్తం శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఆత్మకూరు, దామెర మండలాల్లోని గు రుకులాలను బీఆర్ఎస్వీ నేతలు బైరపాక ప్రశాంత్, అర్షం మధుకర్ ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలు తెలుసుకుంటుండగానే పోలీసులు వచ్చి అడ్డగించారు.