‘కన్నెపల్లి’ నీటిని ఎత్తిపోయాల్సిందే.. రిటైర్డ్ ఇంజినీర్లను అవమానించడం సరికాదు
ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు భయపెడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు పేరొస్తుందనే అక్కసుతో రైతులను అరిగోస పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యలు మానుకొని వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్‌చేయాలని డిమాండ్ చేశారు.
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 12 : ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు భయపెడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు పేరొస్తుందనే అక్కసుతో రైతులను అరిగోస పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యలు మానుకొని వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్‌చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన సలహాలను ప్రభుత్వం స్వీక రించాల్సింది పోయి, వారిని జైలుకు పంపాలంటూ మాట్లాడటం సీఎం రేవంత్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఒక బాధ్యతగల ప్రభుత్వం అయితే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరిస్తూ అధికారులతో వివరణ ఇప్పించాలి కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని నిప్పులుచెరిగారు. కుంగిన పిల్లర్లకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కూడా మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మేధావులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

