హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం అక్రమమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన నిరుద్యోగులను, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టంచేశారు. నిరుద్యోగులకు అడ్డగోలుగా హామీలిచ్చి, విస్మరించిందని విమర్శించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడుతామని, యూత్ డిక్లరేషన్ను అమ లు చేస్తామని హామీలిచ్చిన రేవంత్ సరారు.. నిరుద్యోగులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్కు ఓటేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పిన కోదండరాం, ఆకునూరి మురళి వంటి మేధావులు, రియాజ్, బల్మూరి వెంకట్ లాంటి ఎన్ఎస్యూఐ నేతలు పదవులు రాగానే పెదవులు మూసుకున్నారని మండిపడ్డారు.