హైదరాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ): మూసీ పునరుద్ధరణపై సీఎం పూటకోమాట మాట్లాడుతూ సభను తప్పుదోవపట్టించడమే కాకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం దుర్మార్గమని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తాననే భ్రమలో ఇష్టారీతిన మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీలో సభ్యుల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ సైతం ఏకపక్షంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.