హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగా ణ): రాష్ట్ర రైతాంగ శ్రమను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్ల పై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా అసత్యా లు మాట్లాడారని విమర్శించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో రైతాంగాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని ఆదివా రం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతారని తమ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే నిర్ణయం తీ సుకోనున్నాయని తెలిపారు.
సీఎం రేవంత్రె డ్డి ఆ విషయాన్ని దాచిపెట్టి కేసీఆర్ పాలనలో తీసుకున్న నిర్ణయమ ని ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మె డమీద కత్తిపెట్టినా, ఆర్థికంగా రూ.30వేల కో ట్ల నష్టం వాటిల్లినా రైతాంగానికి ఇబ్బందులు కలుగనివ్వలేదని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ర్టానికి ఏ హామీలు, నిధులు రాకపోయి నా తాను మోదీని పెద్దన్నగానే చూస్తున్నానని రేవంత్రెడ్డి పేర్కొనటంలో ఆంతర్యం మోటర్లకు మీటర్లు పెట్టడమేననే విషయం అసెంబ్లీ వేదికగా తెలిసిపోయిందని పేర్కొన్నారు. మీ టర్లు పెడితే 98 లక్షల రైతు కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని, ఎట్టిపరిస్థితుల్లో నూ మీటర్లు పెట్టనీయమని స్పష్టంచేశారు.