ఏ పార్టీలో ఉన్నావో తెలుసుకున్నవ్.. సంతోషం
‘ఇకనైనా బుద్ధిగా ఉండు, పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్‌పై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- పకింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో
- కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లల్ల కట్టెలు అడ్డం పెట్టకు
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్‌పై కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మండిపాటు
జగిత్యాల, ఫిబ్రవరి 4: ‘ఇకనైనా బుద్ధిగా ఉండు, పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్‌పై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొన్నారని, ఇప్పటికైనా తాను ఏ పార్టీలో ఉన్నానన్న విషయం తెలుసుకోవడం సంతోషమేనని చెప్పారు.
చట్టసభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉండాలని, ‘మీ సంసారం చకబెట్టుకోకుండా, మా సంసారంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావ్? అభివృద్ధి అంటే పకింటికి కన్నం వేయడమా? అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. 20 నెలల్లో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించి ఏర్పాటుచేశారని, అప్పటి నిజామాబాద్ ఎంపీ మధుయాషీ క్రిటికల్ కేర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ విధానపరమైన అభివృద్ధి నిర్ణయాలని చెప్పారు.
జగిత్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల టెండర్‌ను గౌరీశంకర్ ఇన్ఫ్రా కంపెనీ 3 శాతం అధికంగా కాంట్రాక్ట్ దకించుకున్నదని, పైగా 14 శాతం ఎస్టిమేషన్లో కలిపి, 17 శాతం నేరుగా లాభం పొందుతున్నారని, దానివెనుక ఎంత లాభం ఉన్నదో వారికే తెలియాలని పేర్కొన్నారు. పకింటికి కన్నం వేయడం, బిల్లుల కోసం తాపత్రయ పడటం, ఇదేనా మీ అభివృద్ధి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఆ ఫలాలు కార్యకర్తలు పొందాలి కానీ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వచ్చి పార్టీలో చేరి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొంటూ లాభాలు పొందడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

