హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మక్కజొన్న రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ ప్రభు త్వం నిర్లక్ష్యం వీడి మక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేర కు బుధవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతుల ఇబ్బందులకు సంబంధించిన పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదేపదే తమకు గుర్తుచేయాల్సి రావ డం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
పంటల దిగుబడి సమయంలో ఒక ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సింది పోయి, పూర్తి అలసత్వం ప్రదర్శించడం తెలంగాణ రైతుల దురదృష్టమని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా సు మారు ఏడు లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేశారని, పంట కోతకు వచ్చి మకలను మారెట్లోకి తరలిస్తున్నారని వివరించారు. దాదాపు అన్ని మారెట్ యార్డులు మక్కజొన్న నిల్వలతో నిండిపోయాయ ని, కానీ, ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో రైతుల శ్రమను దళారులు దోచుకుతింటున్నారని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ.2,400 మద్ద తు ధరతోపాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చి హామీ మేరకు రూ.330 బోనస్‌ను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.
రైతుల కష్టాలు మీ కండ్లకు కనిపించడం లేదా? వారి రోదన మీకు వినిపించడం లేదా? ఢిల్లీ టూర్లు, కమీషన్లు, సెటిల్మెంట్లు పకనబెట్టి రైతుల బాధలపై దృష్టి పెట్టండి. రైతుల ఏడుపు, అన్నదాతల ఆవేదన కంటే.. తమరికి కక్ష రాజకీయాలే ముఖ్యమా? -హరీశ్‌రావు పంటను అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకునే దుస్థితి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అడ్డికి పావుశేరు చొప్పున రైతులు పంటను అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. క్వింటాల్ మకలను రూ.1,600కే రైతుల వద్ద నుంచి ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత రెండేండ్లుగా బోనస్ డబ్బుల ఊసు లేదని, ఇటు మద్దతు ధర రాక, అటు బోనస్ లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మకజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400తోపాటు రూ.330 బోనస్ లభించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.