కేసీఆర్ పాలనలో దుకి దున్నినప్పటి నుంచి పంట కొనుగోళ్ల దాకా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటే, రాజకీయ విషక్రీడలో, తిట్ల పురాణాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పాలనలో రైతులు దికులేని పక్షులై దీనంగా చూస్తున్నరు. ఇకనైనా హైడ్రాలు, మూసీలు, ఫోర్త్ సిటీ డంభాచారాలను కొంచెం పకనపెట్టి పంట కొనుగోళ్ల మీద, మద్దతు ధర మీద, ఇస్తామన్న బోనస్ మీద దృష్టి పెట్టండి.
– హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాలా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి సర్కారు.. ఒక్క హామీని కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులకు రుణమాఫీ కాలేదు.. రైతుబంధు అందలేదు.. పంటలకు బోనస్ బోగస్ అయింది. కనీసం పంటల కొనుగోళ్లు చేపట్టలేకపోయింది.. రాష్ట్రంలో ఎక్కడా పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయలేదు’ అని ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతులకు శాపంగా పరిణమించిందని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
‘తెలంగాణలో 44.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరిగిందని అధికారిక అంచనాలు ఉన్నయి. రాష్ట్రవ్యాప్తంగా 322 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభించినట్టు ఆర్భాటంగా ప్రకటించిండ్రు. ఆచరణలో ఇప్పటి వరకు ఒక రైతు దగ్గర కూడా పత్తి కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం, పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 తోపాటు రూ.500 బోనస్ కలిపి రూ.8,021కి కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనకపోవడం వల్ల రైతులు వ్యాపారులకు రూ.ఐదు వేలకే అమ్ముకొనే దుస్థితి వచ్చింది. అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయి ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదు.
గోరు చుట్టుపై రోకటి పోటులా.. దిగుబడి తగ్గడంతోపాటు తకువ ధరకు అమ్ముకొని పత్తి రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇది పూర్తిగా రేవంత్ సరారు వైఫల్యం. మకల పరిస్థితి మరీ దారుణం. మకల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు. మకకు మద్దతు ధర రూ.2,225 ఉంటే కాంగ్రెస్ ఇస్తానన్న బోనస్ కలిపి రైతుకు క్వింటాల్‌కు రూ.2,725 ధర లభించాలి. కానీ, ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలే పెట్టకపోవడంతో దికుతోచని మక రైతులు రూ.2 వేలకే అమ్ముకొని లబోదిబోమంటున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పది కిలోల సన్నాలు కూడా కొనలే
రాష్ట్రవ్యాప్తంగా ఎకడా సన్న బియ్యం పట్టుమని పదికిలోలు కొన్న దాఖలాల్లేని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘వరి కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులు రాలేదు. ఏ ఊరు ధాన్యం ఏ మిల్లుకు పోవాల్నో ఒప్పందం జరుగలేదు. ధాన్యం రవాణా ఏర్పాట్లకు కూడా దికులేదు. ప్రభుత్వం కట్టాలని చెప్పిన ఎర్రరంగు సుతిలి దారం గాని, పచ్చరంగు సుతిలి దారం గాని కొనుగోలు కేంద్రాలకు చేరిన దాఖలాల్లేవు. వరి పండించిన రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే.. అంగట్లో అవ్వ అంటే ఎవనికి పుట్టినవ్ బిడ్డా.. అన్నట్టున్నది. బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం మద్దతు ధర కూడా లభించని దౌర్భాగ్య పరిస్థితి.. వడ్ల మద్దతు ధర రూ.2,320 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు రూ.1800-1900కే అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకొని కన్నీటి పర్యంతమవుతున్నరు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ పాలనలో రైతులకు రందిలేదు
పదేండ్ల్ల కేసీఆర్ పాలనలో రైతులు రంది లేకుండా బతికారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పది నెలల కాలంలోనే రైతుల కష్టానికి ఫలితం దకక అలమటించేలా చేశారని మండిపడ్డారు. పంట పెట్టుబడి కోసం ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇప్పటికే రైతుల నెత్తిన శఠగోపం పెట్టారని విమర్శించారు. ‘ఇప్పుడు కొనుగోళ్లు కూడా చేయకుండా రైతుల ఉసురు తీయొద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అడవి బిడ్డల ఘీంకారం కుమ్రంభీం: హరీశ్
అడవి బిడ్డల ఘీంకార స్వరం కుమ్రంభీం అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివాసీల పోరాటయోధుడు కుమ్రంభీం జయంతి సందర్భంగా మంగళవారం ఎక్స్ వేదికగా హరీశ్ నివాళులర్పించారు. ‘అడవి బిడ్డల ఘీంకార స్వరం.. ఆదివాసుల స్వయం ప్రతిపత్తే ధ్యేయంగా ఎగిసిన ఉద్యమ బావుటా.. దేశానికి స్వాతంత్య్రం రాకముందే జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరు తలపెట్టిన యోధుడు కుమ్రంభీం. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత సన్న రకాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొకులు నొకారు. ఇప్పుడు అటు సన్నాలకు, ఇటు దొడ్డు రకాలకు బోనస్ మాట అంటుంచి మద్దతు ధర కూడా లభించని దౌర్భాగ్య స్థితిలోకి రైతులను నెట్టేశారు. రాష్ట్రంలో ఎకడా సన్నబియ్యం పట్టుమని పది కిలోలు కూడా కొన్న దాఖలాల్లేవు.
మా ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుడు ఈ రోజుకు 8 లక్షల 63 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు రేవంత్ సరారు ఇప్పటివరకు కేవలం 10-15 వేల మెట్రిక్ టన్నులకు మించి కొనలేదు. అంటే గతంలో మేము కొనుగోలు చేసిన ధాన్యంతో పోలిస్తే కేవలం 2 శాతం ధాన్యమే కొన్నారు.
-మాజీ మంత్రి హరీశ్ రావు