సింహాసనం ఎక్కినా బుద్ధి మారలే
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
- ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఫుట్‌బాల్ ఆడుతవా రేవంత్?
- భ్రమల నుంచి బయటికి వచ్చి రాష్ర్టాన్ని చూడు
- మీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు
- చేతగాని పాలనను అసహ్యించుకుంటున్నారు
- సామ్‌ల పాలనను ప్రతిఒకరూ ఛీ కొడుతున్నారు
- అందిన కాడికి దోచుకోవడం, అందరూ కలిసి పంచుకోవడం.. ఇదే కదా మీరు చేస్తున్నది!
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు శనివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? లేక ప్రపంచ ఆటగాడివా? భ్రమల నుంచి బయటికి వచ్చి చూడు రేవంత్‌రెడ్డి. నీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. నీ చేతగాని పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నా రు. నీ సామ్‌ల పాలనను ప్రతి ఒకరూ ఛీ కొడుతున్నారు. అందిన కాడికి దోచుకోవడం, అందరూ కలిసి పంచుకోవడం.. ఇదే కదా మీరు చేసింది’ అంటూ దుయ్యబట్టారు. కనీసం ఎస్ఎల్బీసీ సొరంగంలో చికుకున్న శవాలను ఇప్పటికీ బయటకు తీయలేని దద్ద మ్మ ప్రభుత్వం మీదని విమర్శించారు. రోమ్ తగలబడుతుంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వా యించినట్టు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందు ల్లో ఉంటే.. సీఎం ఫుట్‌బాల్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆటలాడటంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద, పరిపాలన మీద లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
మూటలు, వాటాలు, కమీషన్లే మీ విజన్
మూటలు, వాటాలు, కమీషన్లు.. ఇదే కదా మీకున్న విజన్ అని కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు మండిపడ్డారు. నలుదికుల గద్దల్లా మారి భూములను ఖతం పట్టిస్తున్నారని విమర్శించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి అందినకాడికి దండుకుంటున్నరు. కూట్లో రాయి తీయలేని రేవంత్ మాట్లాడి తే ప్రపంచస్థాయి అంటుండటం హాస్యాస్పదం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ.. ఎవరి ని మభ్య పెడుతున్నా వు? ఇందులో ఎన్ని కోట్ల సామ్‌కు ప్లాన్ వేసినవు. ఎవరి వాటా ఎంత? చిల్లర మాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం అభివృద్ధి చెందదు, ప్రజల సమస్యలకు పరిషారం లభించదు. విస్తరి ఆకులా ఎగిరెగిరి పడుతున్న రేవంత్‌రెడ్డి.. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అన్న విషయం గుర్తుంచుకో.. అహంకారం తగ్గించుకొని అజ్ఞానాంధకారం తొలగించుకో’ అని హితవు పలికారు.
బీఆర్ఎస్పై ఏడ్వడం తప్ప ఏమి చేశావ్?
రెండేండ్లుగా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద పడి ఏడ్వడం తప్ప మీరు చేసిందేమున్నదని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్టు అయిపోవని చురకలంటించారు. అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన, వాస్తవాలు మరుగున పడిపోవని, కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు మరచిపోరని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఒక రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధం చెప్తున్న రేవంత్.. 6,47,479 రేషన్‌కార్డులు మంజూ రు చేసింది అబద్ధ్దమా? అని ప్రశ్నించారు. గతంలో 4 కేజీల బియ్యం మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆరు కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది అబద్ధమా? అని నిలదీశారు.
ఇరిగేషన్‌పై మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్
‘నల్లగొండ ప్రజల మీద కక్షగట్టింది ఎవ రు? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ముగింపులేనిదానిగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడా వు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో రూ.3892 కోట్లు ఖర్చు చేసి, 11.48 కి.మీ సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా? ఈ లెకలు మీ ప్రభుత్వం దగ్గర లేవా? పదేపదే ఎందుకు అబద్ధ్దాలు చెప్తున్నారు రేవంత్‌రెడ్డి? మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నది మీరు కాదా? రెండేండ్లలో కొత్తగా ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వని మీరు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ వస్తుంది. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నరు’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌కు యూరియా సరఫరా చేతకాదు
రేవంత్‌రెడ్డికి యూరియా సరఫరా చేయ డం చేతకావడంలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
అంబేద్కర్ సేవలు మరువలేనివి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారా తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన మహనీయుడు అని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అసమానతలు లేని సమాజం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

