హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): డెంగ్యూ, మలేరియా, చికున్గున్యావంటి విషజ్వరాలతో రా ష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. డెంగ్యూతో 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఎక్స్‌వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని వానకాలం ప్రారంభంలోనే కోరినా సర్కార్ పెడచెవిన పెట్టిందని విమర్శించారు. సీఎం, సీఎస్ స్థాయిలో ఒక్కరో జూ సమీక్ష చేయలేదని, గ్రామాలు, ప ట్టణాల్లో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీల కు నిధులు విడుదల చేయకపోవడంతో మురికికూపాలుగా మారుతున్నాయని, జేబుల నుంచి ఖర్చు చేస్తూ వచ్చిన కా ర్యదర్శులు తమ వల్ల కాదని సామూహికంగా సెలవు పెట్టి విధులకు దూరం గా ఉంటున్నా రని ఉదహరించారు. ప్ర భుత్వం ఇప్పటికైనా సమీక్ష నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కానిస్టేబుళ్లందరినీ ఒకేలా చూడండి ;డిప్యూటీ సీఎంకు హరీశ్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల కు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులను కొన్ని జిల్లాలకే ఇచ్చి మిగతా జిల్లాలకు ఇవ్వకపోవడం బాధాకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలోని దాదాపు 6 వేల మంది కానిస్టేబుళ్లకు లీవ్ బెనిఫిట్‌ను 8 నెలలుగా పెం డింగ్ పెట్టారని, పెట్రోల్, డీజిల్ బిల్లు లు రాక పోలీసులు, పెట్రోల్ బంక్ ని ర్వాహకులు ఇబ్బంది పడుతున్న తీరు పై డిప్యూటీ సీఎం భట్టికి లేఖ రాశారు. ‘కానిస్టేబుళ్లపై ఎందుకింత వివక్ష? రా్ర ష్ట పోలీసుల్లో వీళ్లు భాగం కాదా? ఒకే డిపార్ట్మెంట్లో పక్షపాతం ఎందుకు? ఇది వారి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడ మే’ అని లేఖలో పేర్కొన్నారు.