హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డీ..బురద రాజకీయాలు మానుకో.. వరద బాధితులను ఆదుకో..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అ య్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన వల్లే హైదరాబాద్ జల దిగ్బంధమైందని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయి లో వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ వచ్చి నా, వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభు త్వం మొద్దునిద్ర వీడకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? అని దుయ్యబట్టారు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉప్రమించపోవడం దుర్మార్గమని, ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హైదరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకున్నదని మండిపడ్డారు. ప్రభు త్వ పట్టింపులేని తనం వల్ల ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు వరద నీటిలో చికుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సొంతూళ్లకు వెళ్లలేక..
పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లలేక భయం భయంగా ప్రజలు రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారని, మూసీ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంటే పరిసర ప్రాంత ప్రజలు బికుబికుమంటూ బతుకుతున్నారని హరీశ్ వాపోయా రు. వరదలో చికుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించాలని, మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
‘టూరిజం’ పేరుతో రేవంత్ భారీ స్కాం!
ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ధి పేరిట కమీషన్లు దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రణాళిక వేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. రూ.15,0 00 కోట్ల పనులను అనుయాయులకు అప్పనంగా అప్పగిస్తూ మరో కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. లక్షల కోట్లు విలువ చేసే వేల ఎకరాల భూములను తన అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు రేవంత్‌రెడ్డి భారీ సెచ్ వేశారని పేర్కొన్నారు. ఈ సామ్‌కు సంబంధించిన ఆధారాలతో సహా త్వరలో బయటపెడతామని తెలిపారు.