హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టు రేవతి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు అరెస్టులతో ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు రేవతిని ఉదయం 5 గంటలకు అక్రమ అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం ఎంత అభద్రతా భావంలో ఉన్నదో స్పష్టమవుతున్నదని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను, ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని మండిపడ్డారు.