హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తేతెలంగాణ): ‘అధైర్యపడొద్దు.. మి మ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. క్షేమంగా స్వదేశానికి రప్పిస్తాం’ అని జోర్డాన్‌లో చిక్కుకున్న 12మంది తెలంగాణ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున చొరవ తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. జోర్డాన్‌లో చిక్కుకున్న నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు చెందిన కార్మికులతో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘మీ సమస్యను విదేశీ వ్యవహారాలశాఖ దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర మంత్రులకూ చెప్పాం. ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సు రేశ్రెడ్డి విదేశీ వ్యవహారాలశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా రని హరీశ్‌రావు వెల్లడించారు.