Mallareddy | పులి రంగంలోకి దిగింది.. మేక సచ్చుడు ఖాయం.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Mallareddy | ‘పులి రంగంలోకి దిగింది.. మేక సచ్చుడు ఖాయం’ అని మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీని ఉద్దేశించి అసెంబ్లీలో మీడియా మిత్రులతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ పునరాగమనం పార్టీలో జోష్ నింపిందని చెప్పారు.
- కాంగ్రెస్ పార్టీ గెలుస్తదని.. బీఆర్ఎస్ ఓడుతదని అనుకోలె
- పార్టీ మారడానికేమీ లేదు.. దునియాలో అన్నీచూసినా
- మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి
Mallareddy | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘పులి రంగంలోకి దిగింది.. మేక సచ్చుడు ఖాయం’ అని మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీని ఉద్దేశించి అసెంబ్లీలో మీడియా మిత్రులతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ పునరాగమనం పార్టీలో జోష్ నింపిందని చెప్పారు. అటు బీఆర్ఎస్ నాయకులు.. ఇటు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాల నుంచి నేటికీ తేరుకోలేదని తనదైన ైస్టెల్లో అన్నారు.
ఓడిపోతామని బీఆర్ఎస్ నాయకులు.. గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. తాను మరోసారి పోటీ చేయనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటని అన్నారు. సీఎంను కలిసేందుకు వెళ్లే ముందు.. మీడియాకు అన్ని వివరాలు చెప్తానని పేర్కొన్నారు. ఈ సారి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని తనపై ఒత్తిడి వచ్చినా.. ఆ టికెట్ను తన కొడుకు కోసం అడుగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ రాకతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

