హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన జలదోపిడీ, సాగునీటి వివక్ష, నీటి ప్రాజెక్టుల విధ్వంసాన్ని సాంకేతిక ఆధారాలతో నిరూపించిన ఇంజినీర్లను సీఎం రేవంత్రెడ్డి జైలుకు పంపిస్తానని హెచ్చరించడం హేయమని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఖండించారు. కాళేశ్వరం కోసం రేయింబవళ్లు శ్రమించిన ఇంజినీర్లు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని సృష్టించడం సర్కార్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి నచ్చిన నివేదిక ఇచ్చిన వారిని దేశభక్తులని, నిజాలు చెప్పిన వారిని నేరస్తుల్లా చిత్రీకరించడం మంచిదికాదని స్పష్టంచేశారు.