బిచ్కుంద, ఫిబ్రవరి 2: రాష్ర్టాన్ని సాధించడంతో పాటు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శం గా నిలిపిన కేసీఆర్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుం ద మండలం పుల్కల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం షిండే మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ పరిపాలన సాగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును విచారణ పేరిట వేధిస్తే సహించేదిలేదని హెచ్చరించారు.