హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ న్యాయవ్యవస్థ దారుణమైన స్థితిలో ఉన్నదని, ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి వివిధ కోర్టుల్లో 5.84 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ)లో సోమవారం జరిగిన ప్రొఫెసర్ ఎస్ వేణుగోపాలరావు 5వ స్మారకోపన్యాస కార్యక్రమంలో రామ్మోహన్రావు మాట్లాడుతూ.. కొత్త చట్టాల్లో పేర్ల మార్పులే తప్ప గణనీయమైన మార్పులేమీ లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో అస్కీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ రమేశ్ కుమార్, గుడ్‌గవర్నెన్స్ చైర్మన్ కే పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు.