హైదరాబాద్, నమస్తే తెలంగాణ : మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని విద్యాసాగర్‌రావు రాష్ట్రపతికి అందజేశారు.