హైదరాబాద్, డిసెంబర్ (నమస్తేతెలంగాణ): డీఆర్టీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డిని ఏఐసీటీఈ(ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) చైర్మన్ ప్రొఫెసర్ సీతారాం ఘనంగా సత్కరించారు. గురువారం ఢిల్లీలోని సతీశ్‌రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాకప్పి జ్ఞాపికను అందజేశారు.
సీఆర్టీ డిమాండ్లు నెరవేర్చాలి
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సమగ్రశిక్ష , గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ డిమాండ్లు నెరవేర్చాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మినిమం బేసిక్‌పే ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత కలిగిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. టీఎస్ఎస్, సీఆర్టీల సమ్మెకు తెలంగాణ భాషోపాధ్యాయ సంఘం అండగా ఉంటుందని స్పష్టంచేశారు.