హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : బీజేపీతో అంటకాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రజాసమస్యలపై పోరాడుతున్న హరీశ్‌రావుపై సీఎం చేసిన అర్థరహిత విమర్శలను ప్రజలు నమ్మబోరని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీస్సులతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు 25 ఏండ్లుగా ఒకే పార్టీలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. కానీ, ఆరెస్సెస్‌తో ప్రారంభమైన రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లో చేరిన తీరు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని అని ప్రశ్నించారు.
కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్మాద వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై బురదజల్లితే తెలంగాణ సమాజం నమ్మబోదని స్పష్టంచేశారు.
పూటకో పార్టీ, గంటకో రంగు మార్చే రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ నేత, ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు ప్రశ్నించారు.