హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగిన తీరు, పార్లమెంట్ ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ప్రధాని, ఆ తర్వాత ఎంపీ తేజస్వీ సూర్య చేసిన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను పవన్ మళ్లీ రిపీట్ చేయడం అమానుషమని మండిపడ్డారు. జూన్ 2న తెలంగాణ గడ్డపై రాజకీయ కుట్ర జరిగిందని మండిపడ్డారు.
ప్రెస్‌మీట్ పేరిట తెలంగాణపై విషం చిమ్మడం, విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు అండ్ కో రాజకీయ వ్యూహాల్లో భాగం గా తెలంగాణను వేదికగా ఎంచుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. ‘సినిమాల్లో పాత్రలు మార్చినట్టే రాజకీయాల్లోనూ పాత్రలు మార్చవచ్చు.. ఒకప్పుడు చేగువేరా ఆదర్శాలు అన్నవారు.. నేడు సనాతన ధర్మానికి అంబాసిడర్‌గా మారడం వారి వ్యక్తిగత ఎంపిక కావచ్చు. కానీ నిన్న నై తెలంగాణ అన్నవారు, నేడు నవనిర్మాణం పేరిట తెలంగాణ చరిత్రను, ప్రజల భావోద్వేగాలను విస్మరించడం సరికాదు.