కేసీఆర్ పుట్టిన రోజున వృక్షార్చన
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
- 17న ప్రతి ఒకరూ మూడు మొకలు నాటాలి
- ఉద్యమ నేతకు మనమిచ్చే బర్త్‌డే కానుక ఇదే
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
- నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వచ్చే సోమవారం ప్రతి ఒకరూ మూడు మొకలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒకరూ మొకలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని చెప్పారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగులా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ వృక్షార్చన కార్యక్రమాన్ని తలపెట్టినట్టు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమ పోస్టర్‌ను హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మంగళవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, శంకర్‌నాయక్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ సమక్షంలో కేటీఆర్ విడుదల చేశారు.
తన మేధో పుత్రిక హరితహారం ద్వారా తెలంగాణ భూతల్లికి కేసీఆర్ ఆకుపచ్చని చీర చుట్టారని గుర్తుచేశారు. వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్‌కుమార్ కోరారు. హరితసేనలోని సభ్యులంతా మొకలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

