హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు బుధవారం చెక్కును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు సైతం జస్టిస్ ఎన్వీ రమణ రూ.10లక్షల ఆర్థికసాయం చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున సీఎం సహాయ నిధికి ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల్లో వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5కోట్లతో ‘ఈనాడు సహాయ నిధిని ప్రకటించింది.
ఏపీలో వదర బాధితుల సహాయార్థం ఏపీ ఉద్యోగుల జేఏసీ రూ.120కోట్లు విరాళం ప్రకటించింది. భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ఓ ప్రకటనలో తెలిపారు.