హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రెడ్డి వర్గానికి భస్మాసుర హస్తం సీఎం రేవంత్‌రెడ్డి అని, రెడ్లంతా ఆయనను బహిష్కరించాలని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలనే కాకుండా రెడ్లను కూడా మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రెడ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేవంత్‌రెడ్డి వారికే నష్టం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.