కాంగ్రెస్‌ను వీడిన బాన్సువాడ మాజీ కౌన్సిలర్లు
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన నియోజకవర్గ కేంద్రం బాన్సువాడకు చెందిన ఆరుగురు అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ను వీడారు. నియోజకవర్గానికి చెంది న పార్టీ నేత ఎలమంచిలి శ్రీనివాస్ ఆధ్వర్యం లో మంగళవారం వారంతా హైదరాబాద్ వచ్చి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
- పోచారానికి భారీ షాక్
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన నియోజకవర్గ కేంద్రం బాన్సువాడకు చెందిన ఆరుగురు అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ను వీడారు. నియోజకవర్గానికి చెంది న పార్టీ నేత ఎలమంచిలి శ్రీనివాస్ ఆధ్వర్యం లో మంగళవారం వారంతా హైదరాబాద్ వచ్చి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇప్పటికే బాన్సువాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు బీ ఫామ్‌లు సమర్పించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న తరుణంలో తాజా చేరికలతో కాంగ్రెస్ కోట కుప్పకూలినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్కు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరికలతో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని స్పష్టంచేశారు. బాన్సువాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.
చేరింది వీరే..
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లలో బాడి శ్రీనివాస్, లాయక్, అక్బర్, ఖాదర్, గంగారామ్, రైటర్ రాజు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో బాన్సువాడ బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

