నిజామాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలతో డీలింగ్ పెట్టుకుని రాష్ట్రంలో భూములను సేల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోదీ, అమిత్‌షాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుకే రాహుల్‌గాంధీ రేవంత్ తోక కత్తిరించారని చెప్పారు. సర్కారుపై పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియెట్‌లో షాడో సీఎంగా సమీక్షలు చేస్తుంటే.. డమ్మీ సీఎంగా మారిన రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో గోళ్లు గిల్లుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వారికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి కలిసి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడు తూ.. ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ కోవర్ట్ అని, రాహుల్‌గాంధీ అందుకే రేవంత్ తోక కత్తిరించారని తెలిపారు.
రేవంత్‌ను అదుపు చేయడానికి రాహుల్ దూతగా వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో సచివాలయంలో అడుగు పెట్టారని నిలదీశారు. గాంధీభవన్‌లో సమీక్షలు పెట్టాల్సిన మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తండడం, సచివాలయంలో సమీక్షలు చేయాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమీక్షలు చేయడం వింతగా ఉందన్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన ఎన్నికల కోసం కాంగ్రెస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి డబ్బులు సమకూర్చారని చెప్పారు. ఇక నుంచి డబ్బుల కలెక్షన్ బాధ్యతలు మీనాక్షి నటరాజన్‌కి రాహుల్‌గాంధీ అప్పగించారని తెలిపారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల కోసం డబ్బు పోగేయడానికే మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగి సచివాలయంలోనే సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో రేవంత్‌కు ఫెవికాల్ బంధం ఉందని, ఆయన మోదీ, అమిత్‌షాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలిపారు. రేవంత్ వచ్చాక హైదరాబాద్‌లో కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ త్రయం రేవంత్‌కు రక్షణ కవచంగా నిలుస్తున్నారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బిగాల గణేశ్ గుప్తా 50వేల మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తున్నదని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కావాలని అంటుండ్రు’ అని తెలిపారు. ఆర్మూర్‌లోని కాలేజీ భూముల వివరాలు తెలుసుకున్నారని తెలిపారు. హెచ్‌సీయూ భూములను అమ్మనిస్తే వచ్చే రోజుల్లో మరిన్ని భూములను అమ్మేస్తారని అన్నారు.