హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచించారు.
ఒకవేళ పెద్దపులి కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని కోరారు. ఈ పెద్దపులి పాదముద్రలను రఘునాథపల్లి పరిధిలో గుర్తించారు.